కేసీఆర్, జగన్ ఇద్దరి ఓటమికి కారణం ఏంటో చెప్పేసిన సీపీఐ నారాయణ

-

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్  పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల నిరసనలను జగన్ పట్టించుకోలేదని.. ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణం అదేనని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ధరణి స్కీమ్ పతనమైతే.. ఆంధ్రప్రదేశ్లో భూరక్షణ పథకంతో జగన్ ప్రభుత్వం పడిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులను, భూముల సమ్యలను పట్టించుకోకపోవడమే వీరిద్దరి ఓటమికి కారణమని నారాయణ అభిప్రాయపడ్డారు.

ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు ఈ సందర్భంగా నారాయణ అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఇక, తెలంగాణలో గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news