BREAKING : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్రం

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగత తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పటికే స్పందించిన కేసీఆర్‌ సర్కార్‌.. అందులోని బిడ్‌ లు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ తరుణంలోనే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదంటూ కీలక ప్రకటన చేశారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్. దానికంటే ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు ఫగ్గన్ సింగ్. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. వీటిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనని ఫైర్‌ అయ్యారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news