BREAKING : మరోసారి తెరపైకి హీరో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ

-

తమిళ్‌ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో విజయ్.అయితే.. తాజాగా మరోసారి హీరో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీపై తమిళనాట ఆసక్తికరమైన చర్చ జరుగు తోంది.

రేపు అంబేద్కర్ జయంతి వేడుకను తమిళనాడు వ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది విజయ్ అభిమానుల సంఘమైన విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్. ఈ మేరకు అన్ని జిల్లాల కార్యదర్శులకు విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ లేఖలు కూడా రాశారు. ఇప్పటికే లోకల్ బాడి ఎన్నికలలో విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పేరుతో బరిలోకి దిగి 51 మంది గెలిచారు. ఎప్పుడూ లేనిది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకల విజయ అభిమానులు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news