గన్నవరంలో వంశీ అనుచరులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వారు మాట్లాడుతూ ఏపీలో గన్నవరం నియోజకవర్గా నికి ఓ ప్రత్యేకత ఉందని, గన్నవరంలో ఎన్నికల ముందు ఎమ్మెల్యే వంశీ మోహన్ కు మద్దతు ఇవ్వాలని దుట్టా రామచంద్రరావు చెప్పారని అన్నారు. కానీ గత కొద్దిరోజులుగా పధకం ప్రకారం ఎమ్మెల్యే వంశీ పై దుష్ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
అందరూ ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాతే నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, అధినాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ధిక్కరించడం సరైనది కాదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం అందరి పై ఉందని అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ వెంటే ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారని, అయితే ఓ పార్టీ ఏర్పడ్డాక పార్టీ సిద్ధాంతాలు నచ్చి అన్నిపార్టీలు వాళ్ళు చేరడం సహజమని అన్నారు. యార్లగడ్డ వెంకట్రావు కూడా టీడీపీ నేపథ్యం ఉన్న వ్యక్తేనని కామీ వైసీపీలో చేరి 2019లో గన్నవరం నుండి పోటీ చేశారని అన్నారు. వైసీపీ మీద నిజమైన ప్రేమ ఉంటే టీడీపీని ఎప్పుడైనా యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారా ? అని వారు ప్రశ్నించారు.