ఆంధ్ర ప్రదేశ్ ఉమెన్ కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆధ్యక్షతన సెక్రేటరియట్ లో మహిళల ఆత్మగౌరవ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై దారుణమైన ఆరోపణలు చేసారు కాబట్టే ఆధారాలు చూపమన్నామని అన్నారు. వితంతువులు, ఒంటరి మహిళల వివరాలను సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారన్న ఆరోపణలు దారుణమైనవని అన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వాలంటీర్లు, మహిళలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేసారు.
మహిళా కమిషన్‌ను పవన్ కల్యాణ్ గౌరవించడం లేదు.. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులను కూడా లైట్‌గా తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మా.. సచివాలయంలో మహిళా కమిషన్ నేతృత్వంలో మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు.. మహిళలపై సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై చర్చించారు.. మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి మద్దతుగా సచివాలయ మహిళా ఉద్యోగులు సంతకాలు చేవారు.. మహిళా ఆత్మగౌరవ దినాన్ని ప్రతి శుక్రవారం జరుపుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు.