ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని అని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి రజని పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ లో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి రజని మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీలో గతం కంటే ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో 1050 నుంచి 3,257 ప్రొసీజర్లకు పెంచామనీ.. ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని అని మంత్రి రజని వెల్లడించారు.
ఇక అటు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్ ఆవిష్కరించారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఇకపై పంటకు గిట్టుబాటు ధర లభించిందన్న బెంగలేదని వెల్లడించారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించారని చెప్పారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం ఆలోచన అని.. తొలిసారిగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.