పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విజయసాయిరెడ్డి

వైసిపి ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి దక్కింది. కేంద్ర రహదారులు, నౌకయానం, పౌర విమానయానం, సాంస్కృతిక శాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యసభ చైర్మన్ హోదాలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కమిటీకి తనను చైర్మన్ గా నియమించిన ధన్కడ్ తో పాటు తనపై నమ్మకం ఉంచిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబంధనలతో నిర్వహిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక పార్టీ నుంచి తనకు ఈ పదవికి ఎంపిక చేసిన జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.