విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

విక్రమ్ అంబలాల్ సారాబాయ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన భారతదేశ భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్షపరిశోధన సంస్థకు ఆధ్యుడు. సారాబాయ్ 1999 ఆగస్టు 12న జన్మించాడు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు. ఒక శాస్త్రవేత్త దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే.. ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో విక్రమ్ సారాబాయ్ జీవితమే ఉదాహరణ. అంతరిక్ష పరిశోధన, తత్సంబంధిత రంగాల్లో గణనీయ విజయాలు సాధించడానికి కారణం ఆయన కృషే అన్నారు. దేశ అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నా. ఆయన అందించిన స్ఫూర్తితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలు ఆవిష్కృతం కావాలి అన్నారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news