వినాయక చవితి స్పెషల్.. తిరుమల భక్తులకు శుభవార్త. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారికి త్వరగానే దర్శనం అవుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది.
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 58, 100 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు 20817 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్లుగా నమోదు అయింది.
ఇక అటు అలిపిరి నడక మార్గంలో భక్తులకు టోకేన్లు జారి పున:రుద్దరణ చేస్తామని వివరించారు ఈఓ శ్యామలరావు. సర్వదర్శనం భక్తులుకు వారానికి 1.63 లక్షల టోకేన్లు జారి చేస్తున్నాం. అన్న, ప్రసాదాల తయారిలో వినియోగిస్తున్న సేంద్రియ వ్యవసాయ పదార్దాల వినియోగం పై కమిటిని నియమించామని చెప్పారు. టీటీడీ లో ఆధార్ వినియోగం పై కేంద్రం నుంచి అనుమతులు లభించాయి. త్వరలోనే నోటిఫికేషన్ వెలుపడుతుందన్నారు ఈఓ శ్యామలరావు.