ఈవీఎంల ధ్వంసం పై 10 సివియర్ సెక్షన్ల కింద కేసులు పెట్టాం : రాష్ట్ర ఎన్నికల అధికారి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూతులో ఈవీఎం ధ్వంసం పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే సీఈసీ.. రాష్ట్ర సీఈవో వివరణ ఇవ్వాలని.. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. మాచర్లలో రెండు, మరికోన్ని ప్రాంతాల్లో 7 మొత్తం 9 పోలింగ్ బూత్లలో ఈవీఎం మిషన్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామని.. ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని.. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news