తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఘటనపై సిసిఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకాన్స్ట్రక్షన్ చేయించామని.. చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించామన్నారు. నడక దారిలో ఫారెస్ట్, పోలీస్, టిటిడి కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
ఘాట్ రోడ్డులో సాయంత్రం 6:00 నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేస్తామన్నారు. నడకదారులలో రెండు గంటల వరకే భక్తులను అనుమతించే అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నడక మార్గంలో ప్రతి 45 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు చేపడతామన్నారు.