OMG.. రోజుకు 2000 కోట్ల సిగిరెట్లు తాగుతున్నారా..?

-

పొగతాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయినా ఎవడూ మానడు. అసలు సిగిరెట్‌ తాగితే బయట ఎలా ఉంటుందో మనకు తెలుసు.. ఏదో కాస్త టెన్షన్‌ రిలీఫ్‌గా, తలనొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ లోపల గుండె ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా..? ఒక్క గుండెనా మొత్తం శరీరం అంతా ఇబ్బంది పడుతుంది. ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ఈ పాడు అలవాటుకు బానిసలవుతున్నారు. ఎంతగా అంటే.. ప్రపంచ వ్యప్తంగా రోజూ 2000 కోట్ల సిగిరెట్లను కాల్చుతున్నారట.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం.. కేవలం సిగరెట్ల కోసమే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెడుతున్న డబ్బు 1,77 342 కోట్ల రూపాయలు. ఆ డబ్బుతో ఎన్నో పేద దేశాలను కాపాడుకోవచ్చు. కానీ సిగరెట్ల వల్ల రోగులుగా మారుతున్న వారి సంఖ్య ప్రతిరోజూ పెరిగిపోతోంది. ప్రపంచంలో 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీరంతా కలిసి రోజుకు 2000 కోట్ల సిగరెట్లు పీల్చి పడేస్తున్నారు. దీనివల్ల వీరి ఆరోగ్యం పాడవ్వడమే కాదు, వారు వదిలిన పొగను పీల్చి చుట్టుపక్కల వారి ఆరోగ్యం కూడా ఎంతో ప్రభావితం అవుతుంది. సిగిరెట్‌ తాగే వారికి కంటే.. అది పీల్చిన వారికే ఎక్కువ ఎఫెక్ట్‌ ఉంటుంది.

సిగరెట్లు కాలాక వదిలే పొగలో 4800 రకాల హానికరమైన రసాయనాలు ఉంటాయి. అందులో 70 రకాల రసాయనాలు కచ్చితంగా క్యాన్సర్లు కలగజేసేవే. అందుకే సిగరెట్లు తాగే వారిలో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. సిగరెట్లు కాల్చడం వల్ల మన శరీరంలోని ప్రతి అవయవానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెడ క్యాన్సర్, నోటి క్యాన్సర్, పెద్ద పేగు, మలద్వార క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, బ్లాడర్ కాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లు… సిగరెట్ల వల్ల వచ్చే అవకాశం ఉంది. మగవారికి మాత్రమే వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్‌కు, సిగరెట్‌కు ప్రత్యక్షంగానే సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు సిగరెట్లలో బెంజిన్ ఉంటుంది. ఇది లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కేవలం క్యాన్సర్లే కాదు గుండె జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, పక్షవాతం వంటివన్నీ కూడా సిగరెట్లు కాల్చడం వల్ల వస్తాయి.

కాల్చడం మానేస్తే చాలా తక్కువ సమయంలోనే పాడైన ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. సిగరెట్ కాల్చినప్పుడు గుండె ఎంతో ఇబ్బంది పెడుతుంది. సిగరెట్ కాల్చిన 20 నిమిషాల తర్వాత వరకు గుండె ఒత్తిడికి లోనవుతూనే ఉంటుంది. దీనివల్లే గుండెపోటు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సిగరెట్లు కాల్చడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మద్యం కంటే హానికరం సిగిరెట్లు తాగడం. మారండి ఇకనైనా మానండి మాష్టారూ.!!

Read more RELATED
Recommended to you

Latest news