వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్టం రాజుపై పరువు నష్టం దావా కేసు వేస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రజిత్ భార్గవ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్టం రాజు ఉద్దేశ పూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎంపీ రఘురామ చేయించిన మద్యం శాంపిల్స్ పై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎస్‌జీఎస్ ల్యాబ్ ఇచ్చిన లేఖపై క్సైజ్ శాఖ కార్యదర్శి రజిత్ భార్గవ స్పందించారు.
ఎంపీ రఘురామ పంపించిన మద్యం శాంపిల్స్ అసలు ఆంధ్ర ప్రదేశ్ నుంచి పంపించినవి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అలాగే మద్యం శాంపిల్స్ ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ చట్టం ప్రకారం జరగలేదని అన్నారు. ఎక్సైజ్ చట్టం నిబంధనలను పాటించకుండానే.. పరీక్షలు చేశారని అన్నారు. పరీక్షలో నిబంధనలు పాటించలేదని ఎస్ జీఎస్ కూడా తెలిపందని వివరించారు.
కాగ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపర్చాలనే ఉద్ధేశంతోనే ఎంపీ రఘురామ ఇలా చేశారని అన్నారు. కాగ ఈ శాంపిల్స్ హానికరం అని ఎస్ జీఎస్ కూడా ఎక్కడ నివేదిక చెప్పలేదని అన్నారు. అలాగే హైడ్రాక్సైడ్ ఉండటం ప్రమాదకరం కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరువుకు భంగం కలిగించిన ఎంపీ రఘురామపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు.