దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజా లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాలు తగ్గనున్నాయి. ఇక నుంచి ప్రతి 60 కిలో మీటర్లకు ఒక టోల్ ప్లాజాను ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 60 కిలో మీటర్ల లోపు 2 టోల్ ప్లాజా లు ఉంటే.. వాటిని తొలగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. 60 కిలో మీటర్ల లోపు 2 టోల్ ప్లాజా లు ఉంటే.. వచ్చే మూడు నెలల్లో తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో ప్రకటించారు. కాగ 2024 వరకు భారత దేశంలో రోడ్లు అన్ని కూడా అమెరికా రోడ్ల లాగా మార్చేస్తామని లోక్ సభలో తెలిపారు. దాని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామని కేంద్ర మంత్రి అన్నారు. కాగ అమెరికా ధనిక దేశం కాబట్టి.. అక్కడి రోడ్లు బాగుండటం కాదు అని అన్నారు. రోడ్లు బాగుండటం వల్లే అమెరికా దేశం ధనిక దేశంగా మారిందని అన్నారు. ఎది ఏమైనా.. కేంద్ర మంత్రి.. వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు.