“చంద్రయాన్ – 3” ప్రాజెక్ట్ స్టాఫ్ కు జీతాల సమస్య … !

-

భారతదేశం గర్వించే ఒక ప్రాజెక్టు ను శ్రీహరికోట లోని ఇస్రో సంస్థ చేసి చూపించింది, చంద్రయాన్ 3 ను సక్సెస్ ఫుల్ గా నింగిలోకి ప్రవేశ పెట్టి ప్రపంచ దేశాలు అంతా అబ్బురపడేలా చేశాయి. కాగా ఈ ప్రాజెక్ట్ లో భాగం అయిన కొందరి స్టాఫ్ కు జీతాలు సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. పూర్తి వివరాల ప్రకారం చంద్రయాన్ 3 ప్రాజెక్టు కు చాలా కీలకం అయిన లాంచ్ ప్యాడ్ ను రాంచీ లోని హెచ్ ఇ సి ఇంజినీర్లు ఎంతో కష్టపడి నిర్మించారు. అయితే ఈ కంపెనీ లో పనిచేసే దాదాపుగా 2700 మంది కార్మికులు మరియు 450 మంది ఎగ్జిక్యూటివ్ లకు గత 14 నెలలుగా జీతాలు రావడం లేదని ఒక జాతీయ మీడియా తెలిపింది. కాగా ఈ జీతాల నిమిత్తం రూ. 1000 కోట్లు ఇవ్వాలని చాలా సార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను అడిగినా ఎటువంటి స్పందన లేదట. దేశం కోసం ఇలాంటి వాళ్ళు రాత్రియంబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నా జీతాలు రాకపోవడం చాలా దురదృష్టకరం.

ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ హై లైట్ చేయకపోవడం ఆశ్చర్యకరం అంటూ నెటిజన్లు బాధపడుతున్నారు. మరి ఈ విషయం వైరల్ అయిన తర్వాత అయినా వీరికి జీతాలు అందుతాయా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news