AP: ఇవాళ విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయనుంది ఏపీ సర్కార్‌. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో పీపీఏల్లో అవకతవకలు, సోలార్, విండ్, పవర్ కొనుగోళ్లల్లో అవినీతిపై వివరించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

White paper on power sector released today

హైడ్రో పంప్జ్ ఎనర్జీ పేరుతో కొన్ని సంస్థలకు లబ్ది చేశారనే అభియోగాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కుంభకోణం, వ్యవసాయ మీటర్ల ఏర్పాట్లల్లో గోల్మాల్ వంటివి వివరించనున్నారు చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలను పెంచేసి గత ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని వివరించనున్నారు ఏపీ సీఎం. జగన్ హయాంలో ప్రభుత్వ రంగంలోని వివిధ పవర్ ప్రాజెక్టులు ఏయే విధంగా ఇబ్బందులు పడ్డాయో శ్వేతపత్రంలో వివరించనున్న చంద్రబాబు….వైసీపీ పార్టీని ఇరించే ఛాన్స్‌ ఉన్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version