తెలంగాణ ప్రజలకు అలర్ట్. తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ రోజు(మంగళవారం) కరీంనగర్, ఉమ్మడి మహబూబ్‌నగర్, జనగాం, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. కాగా సోమవారం ములుగు, జగిత్యాల, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం కురిసింది.
అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అల్లూరి, శ్రీసత్య సాయి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, YSR, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండకూడదని సూచించింది.