జనసేన అధినేత పవన్ కళ్యాన్ రాకపోతే తమ మీటింగ్ కి జనం రారు అనుకునే స్థితికి చంద్రబాబు వెళ్లారని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అహంకారి అయితే.. ప్రజల మనసులో ఎలా ఉంటారు ? చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 2014-19 మధ్య చంద్రబాబు తెచ్చిన స్కీమ్ లు ఉన్నాయా..? చంద్రబాబు, పవన్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
పవన్, చంద్రబాబుకు ఏపీలో అడ్రస్ లేదు. వారికి సపోర్టు చేసే మీడియా అధినేతలు వేరే రాష్ట్రంలో కూర్చొని రాళ్లు వేస్తున్నారు. సాధారణ ప్రజలెవ్వరూ సీఎం జగన్ ను మార్చాలని అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో 30వేల కంటే ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు సజ్జల. చంద్రబాబు టీడీపీని లాక్కున్నారు. పవన్ కు ఎదురు డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు. అది తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పలేరు అన్నారు.