ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుపై నిలిపేసి, నటి కాదంబరీ జెత్వానిని ఎస్కార్ట్ తో పంపడం దారుణమని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ రాకతో సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించలేదని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు చూడలేదు అన్నారు వెల్లంపల్లి. ఉచిత బస్సుల్లో వృద్ధులను ఎక్కించుకోవడంలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి పేదలంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా మంచిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా బాధితులకు ఓర్పు కలగలేదన్నారు. అంతేకాదు బాధితులకు ఐదు రోజులపాటు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. 368 కోట్లు భోజనాల పేరుతో దోచుకున్నారని.. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండానే కోట్లు ఖర్చుపెట్టినట్లు లెక్కలు చెప్పారని కీలక ఆరోపణలు చేశారు వెల్లంపల్లి.