భర్త వేధింపులు భరించలేకపోతున్నా.. అన్నకు మెసేజ్ చేసి చెల్లి ఆత్మహత్య..!

-

నా భర్త వేధింపులు భరించలేకపోతున్నా అని ఇద్దరు బిడ్డలతో కలిసి చనిపోయే ముందు తన అన్నకు వాయిస్ మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకుంది రమాదేవి. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. నేను తప్పు చేయకపోయినా నాపై నిందలు మోపుతున్నాడు.. ఆగస్టు 15న వేరే వ్యక్తితో నా కొడుకుకు బట్టలు తెప్పించాను. ఈ విషయమై నా భర్త రాద్ధాంతం చేశాడు. బట్టలు తెచ్చిన వ్యక్తి భార్య నాతో గొడవ పడింది.

నేను తప్పు చేయకున్నా నాపై నిందలు మోపుతున్నాడు. ఇక నేను భరించలేను ఎన్ని రోజులు ఇలా నిందలు పడుతూ జీవించాలి. అందుకోసమే నేను నా పిల్లలు చనిపోవాలని నిర్ణయానికి వచ్చాము. నా కొడుకుతో చనిపోతున్నామని చెప్పాను. అమ్మ చనిపోతే నొప్పి వస్తుందేమో అని అన్నాడు. చనిపోయిన తర్వాత మనము ఎక్కడికి వెళతాము అమ్మ అని నా కొడుకు అడిగాడు. నేను చనిపోతే నా బిడ్డలు అనాధలు అవుతారు. అందుకోసమే పిల్లలను కూడా తీసుకెళ్తున్న. నేను చనిపోయిన తర్వాత నా మృతదేహాన్ని నా భర్తకు ఇవ్వద్దు. నన్ను కూడా అమ్మను వేసిన చోటే పాతి పెట్టండి. నేను చనిపోయిన తర్వాత నా భర్త పై ఎటువంటి కేసు పెట్టవద్దు అని మృతురాలు రమాదేవి తన అన్నతో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news