ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పోటీ చేసి గెలిస్తే.. ప్రతిపక్ష నేత హోదా – యనమల సంచలనం

-

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, స్థానిక సంస్థలు లేదా ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పోటీ చేసి గెలిస్తే, మండలిలో వైసీపీకు ఉన్న బలం ఆధారంగా జగన్ ప్రతిపక్ష నేత హోదా సాధించుకోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయoతో వైసీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారని… వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు మిగిలాయని బాంబ్‌ పేల్చారు.

TDP senior MLC Yanamala comments on jagan

ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్రంలో అప్పులు పెరిగి ఆదాయం లేదనే వాస్తవాల శ్వేతపత్రం ముఖ్యమంత్రి ప్రజలు ముందు పెట్టడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. శ్వేతపత్రం పై అభ్యంతరాలుంటే అసెంబ్లీకి రాకుండా జగన్ ఢిల్లీ పోవటం, మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన విజయవాడ రాకుండా హైదరాబాద్ పోయి మాట్లాడటం వారిలో భయాందోళనకు నిదర్శనం అన్నారు యనమల. జగన్ అప్పులు గురించి తప్పులు మాట్లాడుతూ ఇంకా దిగజారిపోతున్నారని ఆగ్రహించారు. శ్వేతపత్రంలో అప్పులు అవాస్తమంటున్న జగన్.. తన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు యనమల.

Read more RELATED
Recommended to you

Latest news