ఎక్కడా తగ్గని వెంకట్రావ్.. రెండు కిమీ మేర పాదయాత్రతో పుట్టిన రోజు వేడుకలు !

-

విజయవాడ రూరల్ మండలం నున్నలో హై టెన్షన్ నెలకొంది. నున్నలో యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు ఏర్పాటు చేసిన తన జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకట్రావు. అయితే గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కూడా పుట్టిన రోజు వేడుకలు బహిరంగంగా చేయవద్దని ఆదేశాల నేపధ్యంలో కార్యకర్తలు వత్తిడితో నున్నలో తన కోసం ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలకు 20 వాహనాలతో యార్లగడ్డ హాజరయ్యాడు.

పెద్ద సంఖ్యలో వాహనాలతో నున్న రావడంతో గ్రామం పొలిమేరల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన యార్లగడ్డ, కాలి నడకనే రెండు కిలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లి కార్యకర్తలతో వెళ్ళి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు యార్లగడ్డ. అయితే యార్లగడ్డ గ్రామాల్లోకి రావడంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంకట్రావు పుట్టినరోజు వేడుకల్లో ఎక్కడా కరోనా నిబంధనలు కానరాలేదు. గుంపులు గుంపులుగా, వైకాపా కార్యకర్తలు, యార్లగడ్డ అభిమానులు మోహరించడంతో దాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోయిన జేబు దొంగలు తమ పని తాము చేసుకుపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news