కరెన్సీ నోట్లు కరోనా వాహకాలే… చెప్పేసిన రిజర్వ్ బ్యాంకు

-

కరోనా వైరస్ వాహకాలుగా కరెన్సీ నోట్లు ఉంటాయని, కాబట్టి డిజిటల్ చెల్లింపులను రిజర్వ్ బ్యాంకు సూచించింది అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) ఆదివారం తెలిపింది. కరెన్సీ నోట్లు బ్యాక్టీరియా మరియు వైరస ల వాహకాలా… కాదా అనే దానిపై వివరణ కోరుతూ 2020 మార్చి 9 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సిఐటి లేఖ రాసింది. ఈ లేఖను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపగా… సిఏఐటి కి సమాధానం ఇచ్చారు.

కరెన్సీ నోట్లు కరోనావైరస్ సహా బ్యాక్టీరియా మరియు వైరస్ లకు క్యారియర్లు కావచ్చునని సూచనలు చేసాయి. కాబట్టి కరెన్సీ లేకుండా డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా వాడాలని సూచించింది. “కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు వంటి వివిధ ఆన్‌లైన్ డిజిటల్ ఛానల్స్ ద్వారా ప్రజలు ఇళ్ళ వద్ద కూర్చుని చెల్లింపులు చేయవచ్చు అని సాధ్యమైనంతవరకు నగదును ఉపయోగించడం లేదా విత్ డ్రా చేయడం తగ్గించాలని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది.

సిఐఐటి జాతీయ అధ్యక్షుడు బిసి భారతీయ మరియు సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వివరాలు వెల్లడించారు. ఇక డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరారు. “డిజిటల్ లావాదేవీల కోసం విధించే బ్యాంక్ ఛార్జీలు మాఫీ చేయాలి మరియు బ్యాంక్ ఛార్జీలకు బదులుగా ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు సబ్సిడీ ఇవ్వాలి” అని ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత సమయంలో, అటువంటి రాయితీ ప్రభుత్వానికి ఆర్థిక భారం కాదని… మరోవైపు, ఇది బ్యాంకు నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చులను తగ్గిస్తుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news