వైసీపీ చచ్చిన పాములాంటిది అని తాజాగా ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్థసారధి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తన వెంట నడిచిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మాట్లాడుతూ.. అసెంబ్లీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆదోనిలో అడుగుపెట్టిన నాటి నుంచి తన వెన్నంటి ఉండి, విజయానికి తోడ్పాటు అందించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.
అనంతరం ఆయన్ను కూటమి కార్యకర్తలు, అభిమానులు పార్థసారధిని ఎత్తుకుని విజయకేతనాన్ని ఎగురవేశారు. వైసీపీ చచ్చిన పాము లాంటిదని అన్నారు. కూటమి గెలుపు.. ప్రజల గెలుపు అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.