వైసీపీ నేత రామచంద్రారెడ్డి రెస్టారెంట్ లో సోదాలు.. 14 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

-

పేకాట ఆడకూడదని.. ప్రభుత్వం, పోలీసులు నిత్యం చెబుతున్నప్పటికీ పేకాట రాయుళ్లు మాత్రం అవేమి పట్టనట్ట గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో ఒక చోట పేకాట ఆడుతూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ZPTC గా వైసీపీ నేత రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన రెస్టారెంట్ లో అధికారులు సోదాలు నిర్వహించారు.

పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో నిబంధనలకు విరుద్దంగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లను అధికారులు పట్టుకున్నారు. రెస్టారెంట్ లో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే నిందితుల నుంచి రూ.30వేల నగదు, 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు. రెస్టారెంట్ యజమాని రామచంద్రారెడ్డితో పాటు 15 మంది పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news