బాలయ్య, లోకేష్‌ పీకలదాకా మద్యం తాగుతారు : వైసీపీ ఎమ్మెల్యే

-

బాలకృష్ణ, లోకేష్ కూడా పీకల దాకా మద్యం తాగుతుంటారు.‌.మరి వారిని కూడా ప్రభుత్వమే బలవంతంగా తాగిస్తోందా? అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నిప్పులు చెరిగారు. చంద్రబాబు మద్య నిషేధం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందనొ.. ఊరూరా మద్యాన్ని ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదని.. రాష్ట్రంలో నీచ, దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని నిప్పులు చెరిగారు.

అధికారం అంటే దోచుకోవటం, తన వారికి కట్టబెట్టడం అనేదే ఆయన పాలసీ అని.. టీడీపీ హయాంలోని మద్యం కంపెనీలే ఇప్పుడూ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ బ్రాండ్‌ పేరుతో మద్యానికి అనుమతి ఇచ్చింది చంద్రబాబు అని.. ప్రెసిడెంట్ బ్రాండ్ అనే దానికి 2018 ఫిబ్రవరి ఆరున పర్మిషన్ ఇచ్చారన్నారు.

గవర్నర్ రిజర్వ్ అనే బ్రాండ్ కూడా చంద్రబాబు హయాంలో తెచ్చిందేనని.. 2018 నవంబర్ ఐదున చంద్రబాబు సీఎంగా దానికి పర్మిషన్ ఇచ్చారని వెల్లడించారు. అయినా మేము తెచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని.. ఇవన్నీ జే బ్రాండ్ కాదు, సీబ్రాండ్ అనో, కే బ్రాండ్ అనో పెట్టుకోండని చురకలు అంటించారు. అన్ని రకాల బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చిన ఏకైక సీఎం దేశంలో చంద్రబాబే అని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news