తిరుమలలో హద్దులు దాటినా.. చర్యలు శూన్యమేనా? అంటూ వైసీపీ పార్టీ ప్రశ్నించింది. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ప్రాంక్ వీడియో చేసిన టీటీఎఫ్ వాసన్‌పై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేసింది టీడీపీ కూటమి సర్కార్ అంటూ వైసీపీ ఆగ్రహించింది.
మొక్కుబడిగా వాసన్.. క్షమాపణ వీడియో వదిలి తప్పించుకుందని ఫైర్ అవుతోంది. ఈ మెతక వైఖరితో మరింత మంది ఆకతాయిలు కొండపై పిచ్చి చేష్టలు చేసే అవకాశం ఉందని వైసీపీ తెలిపింది. తిరుమల పవిత్రతని కాపాడేది ఇలానేనా అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ? అంటూ నిలదీసింది వైసీపీ.
అటు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టార్గెట్ చేసింది వైసీపీ. బ్యాంకుని బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలం అంటూ పేర్కొంది. రుణాలు తీసుకోవడం.. తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడాన్ని అలవాటుగా చేసుకున్నారని టీడీపీ నేతలపై ఫైర్ అయింది. రఘరామ కృష్ణరాజు, గంటా ఆస్తుల వేలానికి ఇప్పటికే బ్యాంక్‌లు నోటీసులు. అయినా సిగ్గులేకుండా ఇలాంటి దివాలకోరులను చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని మండిపడింది వైసీపీ.