రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలంటే మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాకూడదని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. నేడు టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేవని, బాపట్లలో 15 ఏళ్ల పిల్లాడిపై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన ఘటనను గుర్తు చేశారు. గంజాయి తాగే వెధవలు ఇలాంటి పనులు చేస్తున్నారని.. వారికి తల్లికి చెల్లికి తేడా తెలియదన్నారు.
ఇక విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని.. గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో ఎవరు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ఇక పెట్రోల్ ధరలు, నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగాయని.. మద్యంలో జగన్ బ్రాండ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాబోయే రోజులలో తాగుడును కూడా తాకట్టు పెట్టే చరిత్ర జగన్ దే అంటూ సెటైర్లు వేశారు.