రాజయ్య సీటుకు కడియం ఎర్త్..కేసీఆర్ ప్లాన్ ఏంటి?

-

తెలంగాణలో చాలా సీట్లలో బి‌ఆర్‌ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సీట్ల కోసం రచ్చ నడుస్తుంది. నేతల మధ్య పోటీ పెరిగింది. ఎవరికి వారు సీట్లు దక్కించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, బి‌ఆర్‌ఎస్ నేతల మధ్య పోరు ఎక్కువ నడుస్తుంది.

ఇదే క్రమంలో మొదట నుంచి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టి. రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఒకప్పుడు రాజయ్య కాంగ్రెస్ లో, కడియం టి‌డి‌పిలో ఉండేవారు ఇద్దరి మధ్య పోలిటికల్ వార్ నడిచేది. ఒకోసారి ఒకరు పై చేయి సాధించేవారు. అయితే రాజయ్య కాంగ్రెస్ వదిలి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చి 2012 ఉపఎన్నికలో గెలిచారు. తర్వాత కడియం టి‌డి‌పి వదిలి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇలా ఇద్దరు నేతలు ఒకే పార్టీలోకి వచ్చారు.

2014లో ఘనపూర్ సీటు నుంచి రాజయ్య పోటీ చేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. మధ్యలో మంత్రి పదవి నుంచి తప్పించి, కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. 2018లో సీటు రాజయ్యకే ఇచ్చారు. మళ్ళీ రాజయ్య గెలిచారు. ఇటు కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఇద్దరి మధ్య బహిరంగంగానే పోరు నడుస్తుంది. నియోజకవర్గంపై పట్టు సాధించాలని చూస్తున్నారు.

అయితే ఎమ్మెల్యేగా రాజయ్యపై నెగిటివ్ ఎక్కువ ఉందని సర్వేల్లో తేలినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఘనపూర్ లో అవినీతి తారాస్థాయిలో జరిగిందని కడియం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో రాజయ్యకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వరనే ప్రచారం నడుస్తుంది. ఇటు కడియంకు గాని, ఆయన కుమార్తెకు గాని ఘనపూర్ సీటు ఇస్తారని తెలుస్తుంది. చూడాలి మరి ఘనపూర్ సీటు విషయంలో కే‌సి‌ఆర్ ప్లాన్ ఎలా ఉందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version