నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్ నుంచే పేపర్ లీక్స్… లీక్స్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

-

విద్యా దీవెన పథకం ఈ రోజు ఇస్తామని తెలిసి ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తూ… వాళ్లే ప్రశ్నా పత్రాలు లీక్ చేస్తున్నారని… టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన వారి స్కూల్ నుంచే ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నారని విమర్శించారు. ఫోటోలు తీసుకుని వాట్సాప్ లీక్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండు నారాయణ స్కూళ్లు, మూడు చైతన్య స్కూళ్ల నుంచి పేపర్ లీక్స్ చేశారని విమర్శించారు. ఎవరండీ ఈ నారాయణ..? చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాదా..? అని ప్రశ్నించారు. వీళ్లంతట వీళ్లే ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తున్నారని… ఎందుకంటే ఈరోజు జగన్ విద్యాదీవెన పథకం ప్రారంభిస్తున్నాడని…మంచి పేరు రాకూడదని ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా వైసీపీ ప్రభుత్వం 31 లక్షల ఇల్ల పట్టాలు ఇచ్చామని.. పేదలకు మంచి జరుగుతుంటే ఓర్చుకోలేని వీళ్లు తప్పుడు రాతలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని టీడీపీని విమర్శించారు. ప్రజలకు ఏనాడు ఈ ఎల్లో పార్టీ, ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా గుంట నక్కల కన్నా హీనంగా మనం చేస్తున్నమంచిని ప్రజల్లోకి పోనీయకుండా చేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news