రైతు రాత మార్చేసిన రాయి.. రాత్రికి రాత్రే లక్షాధికారి..!

-

జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. చిన్న ఘటనతో లైఫ్ లో పెద్ద మార్పులు సంభవించవచ్చు. అప్పటివరకూ కటికపేదరికంలో ఉన్నవారు.. రాత్రిరాత్రికి రాత్రే లక్షాధికారి కావొచ్చ. ఏంటి ఇదంతా సినిమాల్లోనే సాధ్యం.. నిజజీవితంలో ఎక్కడ అవుతుంది అనుకుంటున్నారా.? మన జీవితంలో ఇంకా అలాంటివి జరగకపోవచ్చు.. కానీ ఇలా రాత్రికిరాత్రి రాత్రే రాత మార్చేసుకున్న వాళ్లు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు. గత ఏడాది కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి పొలంలో పని చేసుకుంటుండగా వజ్రం దొరికింది. దాని విలువ కొన్ని కోట్లు పలికింది. ఇప్పుడు తాజాగా ఓ రైతుకి దొరికిన రాయి వల్ల తన రాతే మారిపోయింది. లక్షాధికారి అయిపోయాడు. మీరే చూడండి..

మధ్యప్రదేశ్‌లో పన్నాలో లీజుకు తీసుకున్న గనిలో 11.88 క్యారెట్ల నాణ్యమైన వజ్రాన్ని ఓ రైతు కనుగొన్నాడు. జిల్లాలోని పట్టి ప్రాంతంలోని గనిలో కూలీగా పనిచేస్తున్న రైతు ప్రతాప్ సింగ్ యాదవ్‌కు ఆ వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల అధికారికి రవి పటేల్ బుధవారం వెల్లడించారు. ఆ వజ్రాన్ని త్వరలో జరగనున్న వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయిస్తారట..

ఈ సందర్భంగా వజ్రం వేలం వేయగా వచ్చిన డబ్బుతో వ్యాపారం పెడతానని, తన పిల్లలను బాగా చదివిస్తానని ప్రతాప్ సింగ్ యాదవ్ అంటున్నాడు. వ్యాపారుల అంచనాల ప్రకారం ప్రతాప్ సింగ్‌కు దొరికిన వజ్రం పబ్లిక్ సేల్‌లో రూ. 50 లక్షల కంటే ఎక్కువ పొందవచ్చు. ముడి వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులను మినహాయించి వచ్చిన డబ్బును రైతుకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు.. కాగా పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయని అంచానా వేస్తున్నారు.

అలా అదృష్టం తనను వరించింది. జీవితంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఓ సామాన్య రైతుకు రూ. 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు. లైఫ్ సెట్టై పోతుంది కదూ..

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news