కెసిఆర్ యాదగిరిగుట్ట ను 2 వేల కోట్లతో నాశనం చేశాడు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గత ఏడాది హైదరాబాద్ లో పడినట్లు వర్షం పడలేదు అలా పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కూలిపోయేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుగంటల వర్షానికే క్యూలైన్లు,రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారయింది అంటే 8 ఏళ్లుగా నువ్వు 20 సార్లు వచ్చి ఏమి చేశావు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరా కాంట్రాక్టర్.. సినిమా ఆర్ట్ డైరెక్టర్ పని అప్పగించి మంచి యాదగిరిగుట్ట ను రెండు వేల కోట్ల రూపాయలతో నాశనం చేశారు అంటూ ఆయన ఆరోపించారు.

komatireddy venkat reddy

యాదాద్రి పనులపైన సిబిఐడితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు.. దాంట్లో దోచుకుంది ఎవరు.. నాణ్యత మీద కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలని అన్నారు. ముఖ్యమంత్రి, విజిలెన్స్ వాళ్లకు లెటర్ రాస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు వెంటనే వచ్చి యాదాద్రి ని పరిశీలించండి అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈవో గీతారెడ్డి ఇష్టానుసారంగా నామినేషన్ మీద పనులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పరుగుతీసింది అని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news