ఈ ఏడాది జ‌గ‌న్ ల‌క్ష్యాలు ఇవే.. సాధించాల్సిన అవ‌స‌రం ఎంతంటే!

-

ఏపీ సీఎంగా జ‌గ‌న్‌కుఏడాది పూర్తి అయిపోయింది. అధికారంలో ఆయ‌న‌కు ఇప్పుడు మిగిలింది మరో నా లుగేళ్లు. ఈ నాలుగేళ్ల‌లోనూ చివ‌రి ఏడాది తీసేయాలి. ఎందుకంటే.. అది ఎన్నిక‌ల స‌మ‌యం. జ‌నం నాడి ప‌ట్టుకునేందుకు, వారిని మ‌చ్చిక చేసుకునేందుకు ఉప‌యోగించే స‌మ‌యం. అది ఏపార్టీ అయిన‌ప్ప‌టికీ.. అంతే! దీంతో ఇక‌, మిగిలింది మ‌రో మూడేళ్లు. ఈ మూడేళ్ల‌లోనూ ఒక‌వేళ‌.,. కేంద్రం క‌నుక జ‌మిలి ఎన్నిక‌లు అంటూ.. ముందుకు వ‌స్తే.. 2022లోనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. దీనినే ఇటీవ‌ల చంద్ర‌బాబు కూడా బ‌య‌ట పెట్టారు. మ‌హానాడులో దీనిపై కూడా చ‌ర్చ జ‌రిగింది.

దీంతో ఇప్పుడు న‌డుస్తున్న రెండో సంవ‌త్స‌రం జ‌గ‌న్‌కు అత్యంత కీల‌క‌మైన ఏడాది. ఈ ఏడాదిలోనే ఆ య‌న కీల‌కం అని భావిస్తున్న అంశాల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా గాడిలో పెట్టాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలో వాటిని అమ‌లు చేయ‌డం ద్వారా వ‌చ్చే ఏడాది వాటిని మ‌రింత‌గా పుంజుకునేలా చేసేందుకు స‌మ‌యం ఉంటుంది. మొత్తంగా ఈ ఏడాదిని అంత తేలిక‌గా తీసుకునే అవకాశం జ‌గ‌న్‌కు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కీల‌క‌మైన మూడు రాజ‌ధానుల విష‌యంలో దూకుడు ప్ర‌ద‌ర్శించాల్సి ఉంది.అయితే, ఇప్ప‌టికే వీటిపై కేసులు న‌మోదై.. కోర్టుల విచార‌ణ‌లో ఉన్నాయి.

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగు మీడియం బ‌దులు ఇంగ్లీష్ మీడియంను తీసుకురావ‌డం. ఇది కూడా ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఎక్కింది. అదేస‌మ‌యంలో నాడు-నేడు కార్య‌క్ర‌మం కింద ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ఆధునీక‌రించ‌డం కూడా కీల‌క‌మే. అయితే, దీనిపై కోర్టుల్లో కేసులు లేక‌పోయినా.. డ‌బ్బుతో ముడిప‌డిన వ్య‌వ‌హారం. వేల కోట్ల‌లో నిధులు అవ‌స‌రం. అదేస‌మ‌యంలో స్థానిక ఎన్నిక‌లు కూడా ఈ ఏడాది కాలంలోనే జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో వైసీపీ ఏమేర‌కు పుంజుకుంటుందో చూడాలి. ఇక‌, మండ‌లి ర‌ద్దుపై కూడా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగేందుకు ఈ ఏడాది కీల‌కం.

లేక‌పోతే.. ఇక‌పై త‌న ప్ర‌భుత్వం తీసుకునే ఏనిర్ణ‌య‌మైనా.. 2022 వ‌ర‌కు టీడీపీ అడ్డ‌గించే అవ‌కాశం ఉంది. పింఛ‌న్ల పెంపు స‌హా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అబివృద్ధి బాట‌ప ట్టించ‌డం కూడా జ‌గ‌న్ ముందుకు మ‌రో కీల‌క అంశం. ఇలా ఈ ఒక్క ఏడాది చాలా ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల‌ను జ‌గ‌న్ చ‌క్క‌బెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. వ‌చ్చేఏడాది వీటిని ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం త‌క్కువ‌గానే ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో.. ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news