నాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు వారికి మంచి జరగాలి !

-

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం అయిన ‘‘జగనన్న వైయస్సార్‌ బడుగు వికాసం’’ను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సంధర్భంగా జగన్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలన్న అయన ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కోటి రూపాయలు ఇన్సెంటివ్‌ లు కూడా ఇస్తున్నామన్న ఆయన ఎస్సీలు, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు.

వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్యక్రమాలను చేపడుతున్నామని అలానే ఫెసిలిటేషన్‌ కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని అన్నారు. 16.2 శాతం ఎస్సీలకు, 6శాతం ఎస్టీలకు ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూముల కేటాయిస్తామని స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు ఇవ్వనున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి, వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు చేపట్టామని అన్నారు. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందడానికి గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టామని జగన్ ఈ సంధర్బంగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news