ఎమ్మెల్యేల జాతకాలు తవ్వేస్తున్న జగన్ ? ఒకటే హడల్ ?

-

జగన్ వ్యవహార శైలి గతంలో ఎలా ఉన్నా, ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉంటున్నారు. తనపైన కానీ, ప్రభుత్వం పైన కానీ, ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి మరిచిపోకుండా అమలు చేయడమే కాకుండా, హామీలు ఇవ్వకుండానే ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, జనం మెచ్చిన నాయకుడు అనే ముద్ర వేయించుకోగలుగుతున్నాడు.

CM JAGAN
CM JAGAN

జగన్ వరకు చూసుకుంటే ఆయనను వేలెత్తి చూపించే అవకాశం లేకుండా  చేసుకోగలిగారు. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులపై వెల్లువెత్తుతుండడంతో, జగన్ తీవ్ర అసహనంతో ఉంటున్నారు.

ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు భూసేకరణ విషయంలోనూ, ఇసుక, భూకబ్జాలు వంటి ఆరోపణలు చాలా మంది ఎమ్మెల్యేలపై వస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సైతం వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసి ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. దీంతో ఈ విషయంపై పూర్తిగా దృష్టి పెట్టిన జగన్, ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే విషయంపై ఇంటలిజెన్స్ విభాగం ద్వారా, ఓ ప్రైవేట్ సర్వే ద్వారా వివరాలు సేకరించి, ఎక్కువ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కొంతమంది మంత్రులకు స్వయంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని గట్టిగానే క్లాస్ చదువుతున్నారట.

కేవలం ఆరోపణలు వస్తున్నాయనే జగన్ క్లాస్ పీకడమే కాకుండా, దానికి సంబంధించిన తగిన ఆధారాలను వారికి చూపించి, ఎప్పుడు,  ఎక్కడ అ ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారు అనే వివరాలు, ఆధారాలు చూపిస్తూ ఉండడంతో, సదరు ఎమ్మెల్యేలకు నోటి మాట రావడం లేదట. ఇప్పుడు జగన్ నుంచి ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందో తెలియక, అధికార పార్టీ ఎమ్మెల్యేలు భయంతో హడలెత్తి పోతున్నట్లుగా వైసిపి వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news