వైఎస్ షర్మిలను గెలిపించండి అంటూ వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. కడప ప్రజలు రాజశేఖర్ రెడ్డి ని ఆదరించారు….రాజశేఖరరెడ్డి ఊపిరి ఉన్నంత వరకూ ప్రజాసేవలోనే ఉన్నారని వెల్లడించారు. ఇవాళ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల ఎంపీగా పోటీ చేస్తోందని వివరించారు.

రాజశేఖరరెడ్డి కూతురును పార్లమెంటుకు పంపమని నా విన్నపం అంటూ వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. దీంతో వైసీపీ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. కాగా వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.