బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతుంది. రాష్ట్రం దివాళ తీసిందని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పరు. అది రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తుంది. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ధనిక రాష్ట్రంగా ఉండేది. ప్రస్తుత ముఖ్యమంత్రి అసెంబ్లీలో అక్కసుతో మాట్లాడరాని భాషలో మాట్లాడారు. మిషన్ భగీరథ వ్యవస్థను కాంగ్రెస్ పాలకులు చెడగొట్టారు. పెటుబడి సాయంతో రైతులకు భరోసా కల్పించారు.
ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికాక తప్పదు. ప్రజలు కరెంట్ కోతలతో అష్టకష్టాలు పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పార్లమెంటరీ నేత కేశవరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా.. తరువాత పార్లమెంటరీ నేత ఎవరు అని కేసీఆర్ ను మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. సురేష్ రెడ్డిని పార్లమెంటరీ నేతగా ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. తాము అమలు చేసిన పథకాలు INC ప్రభుత్వం ఆపేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. దివంగత వైఎస్ఆర్ మీద కోపంతో మా ప్రభుత్వం ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ ఆపలేదు కదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కాంగ్రెస్ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే అన్నారు.