ప్రవీణ్ పగడాల మృతిపై YS విమలా రెడ్డి రియాక్టు అయ్యారు. తన బిడ్డలకు ఎవరైనా హాని కలిగిస్తే ఆ దేవుడు క్షమించడని హెచ్చరించారు. ప్రవీణ్ పగడాల ఎన్నో సేవలు చేసినా ఏరోజూ గర్వంతో ఉండలేదని పేర్కొన్నారు. ఎంత మందికి వీలైతే అంత మందికి సహాయం చేసేవారన్నారని పేర్కొన్నారు.
ప్రవీణ్ పగడాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు YS విమలా రెడ్డి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై ys షర్మిల పోస్ట్ పెట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు.