బాత్రూం నుంచి వివేకా డెడ్ బాడీని ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని పేర్కొంది సీబీఐ. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు పొందుపరిచింది సీబీఐ. అంతా అతని సైగల్లోనే కనిసన్నులోనే జరిగాయంటూ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపినట్లు వెల్లడించింది. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని… హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళాడని వివరించింది సీబీఐ.
గూగుల్ టెక్ ఔట్ లొకేషన్ లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలిందని.. తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేక మృతదేహానికి కుట్లు వేయించారన్నారు. అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడని… వివేక చనిపోయాడు అని తెలిసే వరకు ఇంట్లోనే ఉన్నారని తేల్చి చెప్పింది సీబీఐ. వివేక మృతి చెందాడని వార్త తెలియగానే అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారు.. బాత్రూం నుండి డెడ్ బాడీని బెడ్ రూమ్ కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని వివరించింది. వివేక తలకున్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని పేర్కొంది.