వివేకా హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌..వివేకాకు ఇద్దరు భార్యలు !

-

వివేకా హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వివేకాకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెరపైకి వచ్చింది. వివేకా హత్య కేసులో సంచలన విషాయాలు తెలిపారు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. వివేకాకు 2006 నుంచి ఓ మహిళతో సంబంధం ఉన్నదని, దీంతో ఆమెను పెండ్లి చేసుకునేందుకు ముస్లింల ప్రకారం తన పేరును షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

వీరిద్దరికీ ఓ కొడుకు పుట్టడంతో అతనికి షేక్ షహన్ షా అని పేరు పెట్టారని, తన రాజకీయ వారసత్వాన్ని ఆ అబ్బాయికి అప్పగించాలనే ఆలోచన వివేకాకు ఉండేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వివేకా కుటుంబంలో గొడవలు జరిగి హత్యకు దారి తీసి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ హత్య జరిగిన సమయంలో కొందరు వివేకా ఇంటిలో డాక్యుమెంట్ల కోసం వెతికినట్టు నిందితులు తమ వాంగ్మూలంలో చెప్పారని అవినాష్ రెడ్డి గుర్తుచేస్తూ, బహుశా వారు షహన్ షాకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్ల కోసమే వెతికి ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆస్తి తగాదాల్లో భాగంగానే వివేకా హత్య జరిగినట్టు భావిస్తున్నానని తెలిపారు. సిబిఐ అధికారులు ఈ కోణంలో విచారణ జరపడం లేదని అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించేందుకు కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news