ఏపీ సీఎం జగన్‌ వి ఉన్మాద చర్యలు – వైసీపీ ఎంపీ

-

ఏపీ సీఎం జగన్‌ వి ఉన్మాద చర్యలు అని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. ఖండాంతరాలలో ప్రధానమంత్రి గారి ఖ్యాతి దశ దిశలా వెలుగొందుతుంటే, దేశం నగుబాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఉన్మాద చర్యలు కారణం కావచ్చునని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని చితకబాదిన ఘటనను మిలిటరీ ఆసుపత్రి ధ్రువీకరించగా, సుప్రీం కోర్టు తన తీర్పులో ఉటంకించిందని చెప్పారు.

ఇప్పటి వరకు పార్లమెంట్ ప్రివలేజ్ కమిటీ ఈ ఘటనపై విచారణ చేపట్టలేదు, కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అరాచకాలను అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ ప్రస్తావించిందని అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థలతో పాటు తనపై 124 A కేసు నమోదు చేసిన విషయం తెలిసిందేనని, ఎల్జి పాలిమర్స్ విషయములో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఎవరో ఒకరు వాట్సాప్ లో పెట్టిన సందేశాన్ని రంగనాయకమ్మ అనే వృద్ధురాలు ఫార్వార్డ్ చేస్తే ఆమెను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి వేధించారని అన్నారు.

నలంద కిషోర్, డాక్టర్ సుధాకర్ గార్లను ప్రత్యక్షంగా పరోక్షంగా వేధింపులకు గురి చేసిన విధానం పసిఫిక్ తీరాన ఉన్నవారి చెవులకు చేరిందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ మాట్లాడడం అభినందనీయమని, ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల అరాచకంపై, ఆలిండియా మానవ హక్కుల సంస్థను తాను రెండు సార్లు కలిశానని, అయినా పట్టించుకోలేదని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం కనీసం టైప్ చేసే గుమస్తా కూడా లేని దుస్థితిలో ఉందని, ఇక మానవ హక్కుల ఉల్లంఘనను ఎక్కడ పట్టించుకుంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news