అపోహలు, మూడనమ్మకాలు భారతదేశంలో వీలైనంత ఎక్కువగా, మరివీలైనంత తొందరగా వ్యాప్తిస్తుంటాయని అంటుంటారు. అందుకే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సామెతలు పుట్టాయని చెబుతుంటారు. ఇందులో భాగంగానే కరోనా విషయంలో లేనిపోని అపోహలు, నెలకున్న భయాల్ని తొలగించే చర్యలకు వైకాపా నేతలు ఉపక్రమిస్తున్నారు! తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి “శభాష్” అనే పని చేశారు!
కరోనాకు భయపడి గదిలోనుంచి బయటకురాని నేతలు పుష్కలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో… జాగ్రత్తలు తీసుకుంటే కరోనా పెద్ద సమస్య కాదని, కరోనా వచ్చినంత మాత్రాన్న ధైర్యం వదిలేయనవసరం లేదని.. ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతల్లో చూపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… కరోనాతో ఎవరైనా మృతి చెందితే వారిని అనాదలుగా వదిలేయడం అమానవీయమ చర్య అని.. దానికోసం భయపడాల్సిన పనిలేదన్నట్లుగా నిరూపించారు వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
తాజాగా… కోవిడ్‌బారిన పడి ప్రాణాలు విడిచిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా పాల్గొని అపోహలను, అపనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేశారు. తిరుపతిలోని గోవింద ధామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భూమన… ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కరోనా వ్యాప్తిపై నెలకున్న భయాల్ని తొలగించే క్రమంలో స్వయంగా కోవిడ్ మృతదేహానికి దగ్గరుండి దహన క్రియల్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ ధైర్యం టీడీపీ నేతలకు, అధినేతకు ఎప్పుడు వస్తుందోనని ఈ సందర్భంగా ఆన్ లైన్ లో కమెంట్లు పడుతుందటం కొసమెరుపు!!