వైసీపీకి పరాజయం తప్పదు.. మరోసారి ప్రశాంత్ కిషోర్ జోస్యం

-

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్‌కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్‌ మోహన్‌ రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్‌ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్‌ షా కూడా చెబుతున్నారని అన్నారు. పదేళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదని పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపు రోజు నాలుగు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి.. మున్ముందు రౌండ్లలో మాకు మెజార్టీ వస్తుందని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే, జగన్‌ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పారు. ఈ చర్చకు అంతమే ఉండదు. దేశవ్యాప్త ఎన్నికల్లో బీజేపీకి లోగడ కంటే సీట్లు తగ్గవు. దేశంలో బీజేపీ, మోదీలపై అసంతృప్తి ఉంది తప్పితే.. ఆగ్రహం లేదు. అందువల్ల ఈసారి బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news