మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా కరెరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ అంగన్‌వాడీ కేంద్రంలోని టాయిలెట్‌ను కిచెన్‌గా మార్చారు. గత కొద్ది రోజుల నుంచి అందులోనే కేంద్రం చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వండుతున్నారు.
మన దేశంలోని అంగన్‌వాడీ సెంటర్లు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాయో చెప్పేందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఆ సెంటర్లలో చిన్నారులకు కావల్సిన కనీస సదుపాయాలు ఉండవు. నాణ్యమైన భోజనం లభించదు. సరైన స్థలం ఉండదు.. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పుడు చిన్నారులకు ప్రత్యక్ష నరకాలుగా మారాయి. మధ్యప్రదేశ్‌లోని ఓ అంగన్‌వాడీ సెంటర్‌లోనైతే ఏకంగా టాయిలెట్‌నే కిచెన్‌గా మార్చారు. అత్యంత హేయమైన ఈ చర్య పట్ల ఇప్పుడా కేంద్రం నిర్వాహకులపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా కరెరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ అంగన్‌వాడీ కేంద్రంలోని టాయిలెట్‌ను కిచెన్‌గా మార్చారు. గత కొద్ది రోజుల నుంచి అందులోనే కేంద్రం చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వండుతున్నారు. ఆ పై ఆ భోజనాన్ని చిన్నారులకు పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ కేంద్రం నిర్వాహకులు స్పందించారు. కేంద్రంలో వేరే గదులు లేవని, అందుకనే టాయిలెట్‌లోనే వంట వండుతున్నామని వారు తెలిపారు. కాగా ఆ టాయిలెట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, కనుక దాన్ని కిచెన్ గా వాడుతున్నామని వారు తెలిపారు. అయినా సరే.. టాయిలెంట్‌లో వంట వండడం ఏమిటని ఇంకా పలువురు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక ఇలాంటి సమస్యలున్న అంగన్‌వాడీ కేంద్రాలు మన దేశంలో ఇంకా ఎన్ని ఉన్నాయో కదా.. వాటిలో ఉన్న పిల్లలను ఆ భగవంతుడే కాపాడాలి.