శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇవాళ అంగప్రదక్షణ టోకేన్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.
పిభ్రవరి 23 నుంచి 28వ తేది వరకు సంబంధించిన టిక్కేట్లతో పాటు మార్చి మాసంకు సంబంధించిన టిక్కేట్లను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఇక ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. పిభ్రవరి 22 నుంచి 28వ తేది వరకు సంభందించిన టిక్కేట్లను విడుదల చెయ్యనుంది టిటిడి.
కాగా ,తిరుమలలోని 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,702 మంది భక్తులు కాగా, తలనీలాలు సమర్పించిన 27,482 మంది భక్తులు అని టీటీడీ పాలకమండలి పేర్కొంది. ఇక నిన్న హుండీ ఆదాయం రూ.3.43 కోట్లుగా నమోదు అయింది.