ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఈ కాంట్రాక్టు టీచర్లకు ఏదైనా 23 శాతం జీతాలు పెంచినట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం నిత్యావసరాలు ధరలు పెరగడంతో వారి జీతాలు పెంచినట్లు ఆయన వెల్లడించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో ఇంటర్ విద్యార్థులకు బోధిస్తున్న పీజీటీలకు సిఆర్టి లతో సమానంగా వేత నం చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్. పెరిగిన జీతాలు వచ్చే నెల నుంచి జమ కానున్నాయని కూడా తెలిపారు.