నారా లోకేష్, పవన్ కల్యాణ్ కి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా.. అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పాదయాత్రలో యాత్రలో లోకేష్ ప్రకటించచగలరా.. ? పవన్ కళ్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా.. అని ఛాలెంజ్ చేశారు. సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని వీళ్లా జగన్ గురించి మాట్లాడేది.. మాకు పొత్తులు అవసరం లేదన్నారు.
అప్పుడూ ఇప్పుడూ మేము సింగిల్ గానే పోటీ చేస్తాం.. టిడిపి, జనసేన కు ఆ అసత్తా ఉందా అని ప్రశ్నించారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని.. ఉద్యోగాల్లో మా హయాంలో వచ్చిన అవకాశాలు గతం కంటే ఎక్కువ అన్నారు. ఓటర్లు ఉపాధ్యాయులు, పట్టభద్రుల అభ్యర్థులు ఘన విజయం ఖాయమని… ప్రజల్ని ధైర్యంగా ప్రజల్లోకి పంపే ఒకే ఒక్క సీఎం జగన్ అని పేర్కొన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.