బీసీల రిజర్వేషన్ అంశంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాన్ని వేస్తున్న ప్లాన్లను అన్నిటినీ బయటపెడుతున్నారు వైకాపా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జగన్ సర్కార్ అమలు చేయాలని అనుకున్న రిజర్వేషన్లకు ఇటీవల బ్రేక్ పడింది. హైకోర్టులో కొంతమంది జగన్ సర్కార్ తీసుకున్న రిజర్వేషన్ అంశం గురించి పిటిషన్ వేయడంతో బీసీల రిజర్వేషన్ అంశం విషయంలో వైసిపి వెనక్కి తగ్గింది. ఈ సందర్భంగా బీసీ నాయకుడు మరియు మంత్రి అనిల్ కుమార్ యాదవ్…చంద్రబాబుకి కూడా తెలియని చిదంబర రహస్యం బయటికి వెళ్లారు. విషయంలోకి వెళితే హైకోర్టులో పిటిషన్ వేసింది చంద్రబాబు మనిషి అని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన బీరు ప్రతాపరెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ గా పని చేయడం జరిగిందని తెలిపారు. ఇక రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ…ఈ ప్రతాపరెడ్డి సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై పిటిషన్ వేయడంతో ఆ కోర్టు హైకోర్టుకు సూచించింది. దీంతో హైకోర్టు 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని సూచించిందన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు రాష్ట్రాలకు కామన్ గా చంద్రబాబు ప్రభుత్వం వాదనలు వినిపించింది అని గుర్తు చేశారు. 2016లో ఉన్న సుప్రీం కోర్టు యధావిధిగా 60 శాతం ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవాలని తీర్పు ఇచ్చింది. మళ్లీ 2018లో మరో తీర్పు ఇస్తూ ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయ్యాయి కాబట్టి ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిందన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు ఒకపక్క బీసీలపై ప్రేమ అంటారు.. మరోపక్క బీసీలకు వ్యతిరేకంగా తన మనిషితో సుప్రీం కోర్టులో కేసు వేయిస్తాడు…అంటూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్లు టీడీపీ శ్రేణులకు ఉలిక్కి పడేటట్టు చేశాయని టాక్. కావాలని రాజకీయాలు చేయడానికి మరియు ఆంధ్రప్రదేశ్ రావలసిన నిధులను ఆపివేయడానికి చంద్రబాబు చేస్తున్న డ్రామా అని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.