ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్న అనిల్ రావిపూడి!

-

ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చేది కేవలం సక్సెస్‌లతోనే అనే విషయం అందరూ అంగీకరిస్తారు. ఇక్కడ నటీ నటులైనా, దర్శకులైనా, నిర్మాతలైనా..చిన్న ఆర్టిస్టులైనా..సక్సెస్ అయితేనే లైమ్ లైట్ లో ఉంటారు. లేదంటే వారి గురించిన చర్చే ఉండబోదు. అలా తెలుగు చిత్ర సీమలో పరిస్థితులున్నాయని చెప్పొచ్చు.

ఇక దర్శకుల విషయానికొస్తే..టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని చెప్పుకునే వారు కొద్ది మందే అని చెప్పొచ్చు. వరుసగా హిట్ పరంపర కొనసాగించడం కత్తి మీద సాము కాగా, ప్రతీ సారి విజయం సాధించడం చాలా కష్టం.

అలా వరుస విజయాలను అందుకున్న వారిలో ఎస్.ఎస్.రాజమౌళి ఉన్నారు. అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి ఉన్నారు. ఈ జాబితాలో మొన్నటి వరకు కొరటాల శివ కూడా ఉన్నారు. కానీ, ‘‘ఆచార్య’’తో ఆ జాబితా నుంచి బయటకు వచ్చారు. కాగా, అనిల్ రావిపూడి మాత్రం హిట్ ట్రాక్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

F3 సినిమా  చూస్తుంటే జనాలను ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఎట్టి పరిస్థితులలో హిట్ ఫిల్మ్ చేయాలని జాగ్రత్తలు పడ్డట్లు స్పష్టమవుతున్నది. అలా తన పేరును నిలబెట్టుకునే ప్రయత్నమే చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.ఇక ఎఫ్ 3 ఫిల్మ్ చూసి థియేటర్లలో జనాలు తెగ నవ్వుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news