పెట్రోల్, డీజిల్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోవడంతో… చాలా మంది.. సీఎన్‌జీ వైపు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ పెరిగింది. కొత్త కార్లు కొనాలనుకునే వారు.. సీఎన్‌జీ కార్లనే ఎంచుకుంటున్నారు. అయితే.. అందరూ కొత్త కార్లు కొనుగోలు చేయరు కదా.. చాలా మంది.. సెకండ్ హ్యాండ్ కార్లు కొని వాటికి సీఎన్‌జీ ఫిక్స్ చేస్తున్నారు. ఈ పద్దతి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. సెకండ్ హ్యాండ్ సీఎన్‌జి కార్లను కొనుగోలు చేసే వారు ఏ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలో చూద్దామా..!
సెకండ్ హ్యాండ్ CNG కారు కొనాలని ప్లాన్ చేస్తున్నా లేదా ఉపయోగించిన CNG కారును నడుపుతున్నట్లయితే మీరు కొన్ని విషయాలను యజమానులు తెలుసుకోవాలి. అవేంటంటే.. కంపెనీ అమర్చిన CNG కారును కొనుగోలు చేయాడానికే మొగ్గు చూపాలి. ఎందుకంటే కంపెనీలు తమ సిఎన్‌జి కార్ల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంజన్ ఆరోగ్యం కూడా బాగుండే విధంగా, మంచి మైలేజీతో పాటు భద్రతను పొందే విధంగా ఇంజిన్‌తో కలిసి చక్కగా ట్యూన్ చేస్తారు.
మీరు సెకండ్ హ్యాండ్ CNG కారును కొనుగోలు చేసి ఉంటే లేదా ఇప్పటికే ఉపయోగించిన CNG కారును వాడుతుంటే..CNG కిట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి గ్యాస్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. సిలిండర్ నాణ్యతలో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదు. కారు CNG కిట్‌లో పేలుడు సంభవించినట్లు తరచూ చూస్తూనే ఉన్నాం. గ్యాస్ రీఫ్యూయలింగ్ సమయంలో చాలా పేలుళ్లు జరుగుతాయి. అందుకే సిలిండర్ నింపుతున్నప్పుడు కారులో ఉన్న వారందరిని దిగమని చెప్పడం మంచిది.
సాధరణంగా సెకండ్ హ్యాండ్ కారు కానీ బైక్ కొనేముందు చూడాల్సింది.. ఆ వాహనం అవతారం కాదు.. ఇంజన్ కండీషన్ ఎలా ఉంది అని. కొన్ని కార్లు చూడ్డానికి చాలా పాతపడినట్లు ఉంటాయి. కానీ వాటి ఇంజన్ చాలా మంచి కండీషన్‌లో ఉంటుంది. అలాగే కారు కొత్తగా కనిపించనవి కూడా ఇంజన్లు పాడైపోతాయి.